జయహో...సుభాషితాలు...
దండన లేని దేశంలో నీతి నియమాలుండవు...నేటి ఊరుకుల పరుగుల జీవితంలో ఎక్కడ ఏ ఉపద్రవం ఎదురవుతుందో, కాలం ఏ రూపంలో కాటేస్తుందో తెలియని పరిస్థితి...పనిమీద వెళ్లిన మనిషి పదిలంగా సాయంత్రం పూట మన కళ్ళ ఎదుట ప్రత్యక్ష్మయ్యేసరికి ఒక పండుగలా అనిపిస్తుంది...ఇంటినుండి బయట పడింది మొదలు ఏ దుష్టశక్తి మనలను వెంటాడుతుందో తెలియదు... ఏ రూపంలో వచ్చి కాటేస్తుందో తెలియదు.. పరివారాన్నంతటినీ కాపాడాల్సిన వ్యక్తి పదిలంగా ఇంటికి చేరుతాడో లేదో తెలియదు.... అడుగడుగునా కాటేసేందుకు కాలనాగులు క్షణక్షనమూ కాచుకునే వుంటాయి... యుగం ఏదైనా ఈ రాక్షస గణాలు ప్రతి యుగంలోనూ విచ్చలవిడిగా సంచరిస్తూనే వుంటాయి... వీటినుండి తప్పించుకొని మన రక్షకుడు మన ఇంటికి చేరుకున్న మరుక్షణం మాత్రమే మన మనసుకు స్థిమితం దక్కుతుంది... ఆ క్షణం వరకూ మనసుకు ఆందోళన తప్పదు...
MOTIVATIONALTELUGU MOTIVATIONALHUMAN VALUESINSPIRATIONALSPIRITUALPOSITIVE THOUGHTS BY ANNAMAREDDY
రచన : శంకర్ అన్నమరెడ్డి...
1/31/20261 min read


