జయహో...సుభాషితాలు...
అమ్మ అనేది రెండక్షరాల అద్భుతం...ప్రతి గ్రామం లోను పూజలoదే గ్రామ దేవత అమ్మ కన్న బిడ్డే... ప్రతి మతస్థుల పూజలందుకునే ఆయా మతాల దేవుళ్ళు అమ్మలు కన్న బిడ్డలే ... ఆ పరమాత్ముడు ఒక జీవాత్మను కానుకగా ప్రసాధిస్తే ఆ ఆత్మ జీవన యాత్ర సాగించేందుకు అమ్మ తన రక్తమాంసాలతో నిర్మించిన దేహమనే ఒక వాహనాన్ని సృష్టించి కానుకగా ఇస్తుంది...ఈ దేహమనే వాహనం దేవుడు అమ్మ సంయుక్తంగా కలిసి నిర్మించిన ఒక అద్భుతమైన సజీవ యంత్రం...అదృష్టం మనకు ఇచ్చిన సంపద ఒక మారు కోల్పోయినా మరల సంపాదించుకోవచ్చు, కానీ అమ్మ తన రక్తమాంసాలతో సృష్టించి ఇచ్చిన దేహమనే ఈ అపురూపమైన సంపద ఒకమారు చెజారిపోతే అది మరల పొందడానికి మరో జన్మనెత్తాలి... మరో అమ్మ కడుపున పుట్టాలి...
MOTIVATIONALHUMAN VALUESTELUGU MOTIVATIONALINSPIRATIONALSPIRITUALPOSITIVE THOUGHTS BY ANNAMAREDDY
రచన : శంకర్ అన్నమరెడ్డి...
1/30/20261 min read


